ఆ ధైర్యం కాంగ్రెస్‌కు లేదు:కోటంరెడ్డి

నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాదరణ చూసి తమకు కనీసం డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని గ్రహించే కాంగ్రెస్‌ స్థానిక ఎన్నికల నిర్వహణకు చొరవ చూపడం లేదని ఆ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మహాపాదయాత్రలో భాగంగా మంగళవారం స్థానిక 27వ డివిజన్‌లోని పోలీసుకాలనీ, వెలమసంఘం ప్రాంతాల్లో ఆయన నిర్వహించిన పాదయాత్ర 132వ రోజుకు చేరుకుంది. పార్టీ కార్యకర్తలతో కోటంరెడ్డి ఇంటింటికీ వెళ్లి వైయస్ఆర్‌ సీపీ విధి విధానాలను ఆయన వివరించారు. అనంతరం జరిగిన ప్రచార సభలో కోటంరెడ్డి మాట్లాడారు.  మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సాగించిన సంక్షేమ రాజ్యాన్ని నేడు కాంగ్రెస్  ప్రజాకంటక పాలనను పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రాష్ట్రంలో తిరిగి రాజన్న రాజ్యం రావాలని, అందుకు ఆయన తనయుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ముక్త కఠంతో కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, నరసింహయ్యముదిరాజ్, బత్తల వెంకటేశ్వర్లు, నాయకులు భీమనేని మురహరి, సుజిత, నిర్మలమ్మ, టిప్పు, కళ, ఎస్‌కే.మునీర్‌జాన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌పై కేసులు ఎత్తివేయాలి
అర్వపల్లి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేంద్ర ప్రభుత్వం, సీబీఐ అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి మంచి బుద్ధి ప్రసాధించాలని కోరుతూ మంగళవారం పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఇరుగు వెంకటేశ్వర్లు తుంగతుర్తి మం డలం సంగెం నుంచి చేపట్టిన పాదయాత్ర సాయంత్రం అర్వపల్లికి చేరింది. ఈ సందర్భంగా స్థానిక శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో బీరవోలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలకు దూరం చేయడానికి కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. వైయస్ఆర్ సంక్షేమ పథకాల అమలు జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యమని చెప్పారు. పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉం టామని చెప్పారు. కార్యక్రమానికి ముందు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.  
Back to Top