మహానేత వైయస్‌ఆర్‌కు జగన్‌ నివాళులు

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా) :

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద‌ ఆయన తనయుడు, వై‌యస్ఆర్ కాంగ్రెస్ ‌పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్దకు చేరుకున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి, తల్లి శ్రీమతి విజయమ్మ, సోదరి శ్రీమతి షర్మిల, సతీమణి భారతీరెడ్డి, బావ బ్రదర్ అనిల్‌కుమార్, మేనల్లుడు రాజారెడ్డి, మేనకోడలు అంజలి, కుమార్తెలు హర్ష, వర్ష, వైయస్ఆర్ జిల్లా‌ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వైయస్ అవినా‌శ్‌రెడ్డి, పార్టీ చక్రాయపేట ఇన్‌చార్జి వైయస్ కొండారెడ్డి తదితరులు వై‌యస్ఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

క్రిస్మస్‌కు ముందు రోజు ఇడుపులపాయ చర్చి ఆడిటోరియంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. సుమారు రెండు గంటల పాటు ప్రార్థనలు కొనసాగాయి. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులతో శ్రీ జగన్ గడిపారు. ఫాస్టర్లు ఐజాక్ వరప్రసాద్, మృత్యుంజయ, నరే‌శ్‌బాబులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దీవించారు. అనంతరం శ్రీ జగన్‌, కుటుంబ సభ్యులు పులివెందులకు బయలుదేరి వెళ్లారు.

తాజా వీడియోలు

Back to Top