హైదరాబాద్, 17 సెప్టెంబర్ 2012: శాసనసభలో తమ పార్టీ సభ్యులందరికీ ఒకే చోట సీట్లు కేటాయించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు. సభలో తమ పార్టీ సభ్యులకు ఒక వరుస, సందర్భంగా లేకుండా ఎక్కడ బడితే అక్కడ స్థానాలు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి, అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో భేటి అయ్యారు. అసెంబ్లీ లాబీల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గది కేటాయించాలని స్పీకర్_కు వారంతా ముక్తకంఠంతో స్పీకర్‌కు విన్నవించారు.