షర్మిల మరో ప్రజాప్రస్థానం అనుపమానం

తిరుపతి, 29 జూలై 2013:

శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రపంచ చరిత్రలోనే అరుదైనదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‌కేంద్ర పాలక మండలి సభ్యుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల కష్టాలను శ్రీమతి షర్మిల స్వయంగా తెలుసుకున్నారని ఆయన ప్రశంసించారు. ‌మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ కుమార్తె కావడంవల్లే‌ శ్రీమతి షర్మిల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగారని అన్నారు. అన్న జగనన్న మాట.. నాన్న రాజన్న బాటలో ఆమె పట్టుదలతో పయనిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు నాయుడు యాత్రకు, శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు అస్సలు పొంతనే లేదని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. విపరీతమైన చలి, నిప్పులు చెరిగే ఎండలను సైతం లెక్కచేయకుండా ఆమె పాదయాత్ర సాగిస్తున్నారని చెప్పారు. వైయస్‌ఆర్ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రె‌స్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు‌ శ్రీమతి షర్మిల ఎండగట్టారని భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top