షర్మిల నేటి పాదయాత్ర షెడ్యూల్‌ ఇదీ

మహబూబ్‌నగర్‌, 2 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం ఉదయం పాలమూరు జిల్లా నెల్లికొండి గ్రామ శివార్ల నుంచి ప్రారంభమవుతుంది. దేవరకద్ర నియోజకవర్గంలోని లాల్‌కోట, బండరువల్లి, రాకొండ స్టేజ్, గోప్లాపూ‌ర్, దేవరకద్ర మీదుగా‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, జిల్లా కన్వీనర్‌ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడించారు. ఆదివారం రాత్రికి శ్రీమతి షర్మిల దేవరకద్ర శివార్లలో బస చేస్తారని తెలిపారు. శ్రీమతి షర్మిల ఆదివారంనాటి పాదయాత్ర షెడ్యూల్ మొత్తం 15.5 కి‌లోమీటర్లు అని వారు వివరించారు.
Back to Top