షర్మిలకు సమస్యలు విన్నవించుకున్న ప్రజలు

శివంపల్లి (అనంతపురం జిల్లా) 25 అక్టోబర్‌ 2012: శివంపల్లి నుంచి గురువారం ఉదయం ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం 8వ రోజు పాదయాత్ర కొద్దిసేపటికి ఆత్మకూరు చేరుకుంది. ఈ పాదయాత్ర సందర్భంగా స్థానిక ప్రజలు తమ కష్టాలను షర్మిల వద్ద మొరపెట్టుకున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తమను వేధిస్తున్నారని స్థానిక వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదనను విన్న షర్మిల స్పందిస్తూ, ఎవరూ అధైర్యపడవద్దని, ముందు ముందు మంచి రోజులు, జగనన్న నేతృత్వంలో సువర్ణయుగం వస్తుందని, త్వరలోనే కష్టాలు తీరిపోతాయని ధైర్యం చెప్పారు.
అంతకు ముందు మరో ప్రజాప్రస్థానం పేరిట‌ షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్ర 8వ రోజు జిల్లాలోని శివంపల్లి నుంచి గురువారం ఉదయం ప్రారంభమైంది. 8వ రోజు పాదయాత్ర ప్రారంభ సమయంలో మహానేత డాక్టర్ వైయస్‌‌ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై షర్మిలకు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. 
శివంపల్లి నుంచి ఆత్మకూరు, తిమ్మాపురం, అప్రాచెరువు, సుబ్బారావుపేట క్రాస్, తుమ్మల క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసా‌గుతుంది.

తాజా వీడియోలు

Back to Top