మరో మైలు రాయి చేరనున్న పాదయాత్ర

తుని 22 జూన్ 2013:

మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టిన శ్రీమతి వైయస్ షర్మిల ఆదివారం నాడు మరో మైలు రాయిని అధిగమించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని కాకరాపల్లి చేరగానే ఆమె పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంటుంది. కిందటేడాది అక్టోబరు 18న ఆమె తన పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకూ, దానిని సమర్థిస్తున్న తెలుగుదేశం పార్టీ వైఖరికీ నిరసనగా పాదయాత్ర చేపట్టిన సంగతి విదితమే. యాత్ర 2500 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా కాకరాపల్లిలో ఏర్పాటుచేసిన 24 అడుగుల ఎత్తయిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరిస్తారు. అక్కడే ఏర్పాటయ్యే సభలో ఆమె ప్రసంగిస్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ  కన్వీనర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో సభకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతవరకూ శ్రీమతి షర్మిల వైయస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.
రౌతులపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి నుంచి శ్రీమతి షర్మిల 187వ రోజు మరో ప్రజా ప్రస్థానాన్ని  ప్రారంభించారు. అక్కడే మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అక్కడి నుంచే  శ్రీమతి షర్మిల పాదయాత్రను మొదలుపెట్టారు. రౌతులపూడి నుంచి మొదలైన పాదయాత్ర బలరాంపురం,  ములగపూడి, రామకృష్ణాపురంల మీదుగా రాజవరం వరకు సాగనుంది. ఆమె అక్కడే రాత్రి బస చేస్తారు.

Back to Top