దనుపురంలో షర్మిల బహిరంగ సభ

శ్రీకాకుళం 29 జూలై 2013:

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వై.యస్. జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చరిత్ర సృష్టించనున్నారు. సోమవారం ఆమె 3000 కి.మీ మార్కును చేరనున్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 224వ రోజు కార్యక్రమ వివరాలను కార్యక్రమా సమన్వయకర్త తలశిల రఘురాం, వైయస్‌ఆర్ కాంగ్రెస్  జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ తెలిపారు. సోమవారం ఉదయం ధర్మలక్ష్మీపురానికి సమీపంలోని బస నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర  మొదలవుతుంది. నౌతల మీదుగా ధనుపురం చేరుకుంటుంది. అక్కడ 3000 కి.మీ యాత్ర పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కమలమ్మకొట్టు చేరుకుంటారు. భోజన విరామం తర్వాత కొరసవాడ, బూరగాం గ్రామాల మీదుగా పాతపట్నం చేరుకుంటారు. అనంతరం అక్కడికి సమీపంలో రాత్రి బస చేస్తారు.

Back to Top