సంతకాల సేకరణకు విశేష స్పందన

హైదరాబాద్, 27 డిసెంబర్ 2012: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి అరెస్టును నిరసిస్తూ చేపట్టిన 'జగన్ కోసం... జనం సంతకం' కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ ఆదరణ లభిస్తోంది. పార్టీ శ్రేణులు, యువకులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం పట్ల వారు నిరసన తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

     శ్రీ వైయస్  జగన్మోహనరెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట సంతకాల సేకరణ చేపట్టారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ మొదటి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీలు సీబీఐను పావుగా వాడుకుని అక్రమంగా అరెస్ట్ చేయించాయని మండిపడ్డారు.
      
     చిత్తూరు జిల్లాలోనూ శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. పార్టీ చిత్తూరు నియోజకవర్గ నేత మనోహర్ ఆధ్వర్యంలో నగరంలోని ఎంయస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాం డు రోడ్డులోని ఏఎస్‌ఎం కాంప్లెక్స్‌ల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిం చింది. కళాశాలల విద్యార్థులు, గ్రా మీణులు, ఆటోడ్రైవర్లు, కర్షకులు, కా ర్మికులు పెద్ద సంఖ్యలో సంతకాలు చేశారు.
     
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డికి బెయిలు ఇవ్వాలని కోరుతూ రాజమండ్రిలోని స్థానిక కోటగుమ్మం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్ ప్రారంభించారు.  కోటగుమ్మం సెంటర్‌లో సాయంత్రం వరకూ సాగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     శ్రీ  వైయస్ జగన్మోహనరెడ్డిని జైలు నుంచి త్వరగా విడుదల చేయాలని కోరుతూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరుతో ఆ పార్టీ నాయకులు కడప నగరంలో సంతకాల సేకరణ చేపట్టారు. వైవీ వీధిలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి టీకే అఫ్జల్‌ఖాన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు.

     శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని హయత్ నగర్, నాగోల్, రామకృష్ణాపురం డివిజన్ అష్టలక్ష్మి కమాన్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రారంభించారు.

తాజా వీడియోలు

Back to Top