అధికారపార్టీ వర్గాల్లో వణుకు

అవినీతిలో కూరుకుపోయి దుష్టపాలన
 అన్ని విధాలుగా విఫలమైన బాబు 
సిగ్గులేకుండా ఎమ్మెల్యేల కొనుగోళ్లు
ప్రజాసమస్యలపై వైయస్ జగన్ రాజీలేని పోరాటం

విశ్వేశ్వర్ రెడ్డి:
రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష అధికారపార్టీ వర్గాల వెన్నులో వణుకు పుట్టిస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆంధ్రుల హక్కులను సాధించుకునేందుకు వైయస్ జగన్  దీక్ష చేస్తుంటే...ప్రభుత్వం స్వాగతించాల్సిందిపోయి వైయస్ జగన్ పై విమర్శలకు దిగడం దుర్మార్గమన్నారు. అక్రమంగా కడుతున్న ప్రాజెక్ట్ లను చంద్రబాబు చూసీ చూడనట్టుగా ఉంటే...వైయస్ జగన్  ఆపే ప్రయత్నం చేస్తున్నాడంటూ తెలంగాణ వాళ్లు వైయస్ జగన్ పై మండిపడుతున్నారని  చెప్పారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసగించారని, అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా సాధించడంలో గానీ, కరవుతో అట్టుడుకుతున్న వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో గానీ అన్నింటిలో బాబు విఫలమయ్యాడని ఫైరయ్యారు. 

రాయలసీమలో నిరంతరం కరవు వెంటాడుతోంది. గ్రామాలకు గ్రామాలు వలసలు పోతున్నారు. రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవేమీ బాబుకు పట్టడం లేదని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆత్మహత్యలు గుర్తించడానికి కూడా బాబు నిరాకరిస్తున్నారు. ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. పైపెచ్చు ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారు. వేతనాల కోసం ఆందోళనకు దిగిన ఉద్యోగులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ప్రజాసమస్యలపై ఆందోళన చేస్తే నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. రాజధానిలో కార్మికుల హక్కులను కాలరాశారు. అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసి...దాన్నుంచి వారిని తప్పుదారి పట్టించేందుకు ఎమ్మెల్యేలను కొంటున్నాడని విశ్వేశ్వర్ రెడ్డి బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు ప్రజలు వైయస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే  బాబు సిగ్గులేకుండా అనైతికంగా ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. బాబు అప్రజాస్వామిక విధానాలపై, ప్రజాసమస్యలపై పోరాడాల్సింది పోయి... భయపడి పిరికిపందల్లా పార్టీలు మారారని ఫిరాయింపుదారులపై మండిపడ్డారు. వైయస్ జగన్ కు చెక్కుచెదరని ప్రజాధారణ ఉందని విశ్వశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంది గనుకే రాజీలేని పోరాటం చేస్తున్నారని తెలిపారు. అవినీతిలో కూరుకుపోయి దుష్టపాలన సాగిస్తున్న చంద్రబాబును తరిమికొడదామని పిలుపునిచ్చారు. 

మేకా ప్రతాప్ అప్పారావు:
సూర్యుడు ఎటువైపు ఉదయించినా  రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్ సీఎం కావడం తథ్యమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్న వైయస్ జగన్ ప్రజాసమస్యలపై ఎనలేని పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల పక్షాన పోరాడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో  ముఖ్యమంత్రి  ఏమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేడని దుయ్యబట్టారు. ప్రజాబలం లేని చంద్రబాబు  కోట్లాది రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నారని దుయ్యబట్టారు . బాబు ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారు మరి మాకేమి ఇచ్చారని ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు.  ఇళ్లు ఇచ్చారా, నీళ్లు ఇచ్చారా, ఉద్యోగాలిచ్చారా. ఏ ఒక్కటీ ఇవ్వకుండా అన్ని విధాలా బాబు ఆంధ్రరాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని అప్పారావు మండిపడ్డారు . కూకటి వేళ్లతో ప్రభుత్వాన్ని కూలదోసుకుంటున్నారన్నారు. చెరువులు కొల్లగొడుతున్నారు. ఇసుక కొల్లగొడుతున్నారు. అలా అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు. వైయస్సార్సీపీ సింబల్ పై గెలిచి వేరే పార్టీలోకి వెళితే ప్రజలు క్షమించరని చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. మళ్లీ  రెండేళ్ల తర్వాత వారంతా వైయస్ జగన్ వద్దకు వచ్చి చేతులు కట్టుకుంటారని అన్నారు. 

To read this article in English: http://bit.ly/259FkcS 

తాజా వీడియోలు

Back to Top