గంగుల చొరవతో గ్రామాలకు రోడ్లు

శిరివెళ్ల: ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి చొరవతో స్థానిక పంచాయతీ, మజరా గ్రామాలు కాదరబాదర, వెంకటేశ్వరపురం గ్రామాలకు నిధులు మంజూరయ్యాయని జెడ్పిటీసీ నజీర్, వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు బసాపురం సలాం తెలిపారు. గత రెండేళ్ల క్రితం ఆయా గ్రామాలకు నిధులు, శిరివెళ్ల మెట్ట వద్ద నుంచి గాజులపల్లె మెట్ట వద్ద వరకు లింక్‌ రోడ్లకు ప్రతిపాదనలు చేశారన్నారు. స్థానిక‌ మెట్ట వద్ద నుంచి రుద్రవరం మండలం చిన్న కంబలూరు మెట్ట వరకు రోడ్డు అభివృద్దికి ప్రతిపాదనలు పంపారన్నారు. ఇంకా మిగిలిన సమస్యల పరిష్కారం కోసం గంగుల కృషి చేస్తార‌న్నారు. కార్యక్రమంలో వైయ‌స్సార్సీపీ నాయకులు మాజీ మండల ఉపాధ్యక్షుడు కుల్లాయప్ప, సగ్గెల లింగమయ్య, వార్డు మెంబర్‌ అన్వర్ భాష, దేవస్థానం చైర్మన్‌ దాదిరెడ్డి తిమ్మరాయుడు, పెసరవాయి రఫీ, ముడిమేల నాగరాజు పాల్గొన్నారు.

Back to Top