హైదరాబాద్, 28 ఆగస్టు 2012: అఫిడవిట్లు సమర్పించిన కాలేజీలు ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి ఏడాదికి 50,200 రూపాయలు వసూలు చేసుకోవడానికి హైకోర్టు అనుమతించింది. 1996 నుంచి పే కమిషన్ ఆధారంగా జీతాలు చెల్లించే కాలేజీలకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. మిగతా కాలేజీలు 35 వేల రూపాయల ఫీజు మాత్రమే వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఫీజులపై ఉపసంఘం చర్చ: హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చించేందుకు మంత్రిమండలి ఉపసంఘం మంగళవారంనాడు సచివాలయంలో సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు పితాని సత్యనారాయణ,సారయ్య హాజరయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం 35 వేల రూపాయలు మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. అంతకు మించిన ఫీజులను విద్యార్థులపైనే మోపే అవకాశం ఉంది.