చంద్రబాబు నక్కజిత్తుల రాజకీయాలపై ప్రజలు జాగురత వహించాలివైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన
విజయనగరంః రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల ఓట్లు తొలగించడం పెద్ద కుట్ర అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ వాయిస్ కాల్ పేరుతో టీడీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నవారి ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ ఈ చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తామన్నారు. ప్రధానంగా వైయస్‌ఆర్‌సీపీ గెలిచిన ప్రాంతాల్లో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దాదాపు 20వేల ఓట్లు పెరగడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నక్కజిత్తుల రాజకీయాల పట్ల ప్రజలు జాగురత వహించాలన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు.మేధావులు, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి చంద్రబాబు కుట్రకు తెరపడేవిధంగా ఉద్యమిస్తామన్నారు.