ఎందుకు బాబూ ఢిల్లీకి?

వ్యవస్థలను మేనేజ్ చేద్దామనా...
నిజాయితీగా దర్యాప్తుకు సహకరించే దమ్ముందా?
అడ్డంగా దొరికిపోయినా పదవికి వేలాడుతున్న చంద్రబాబు
 
హైదరాబాద్: ఓటుకు కోట్లు ఉదంతంలో అడ్డంగా దొరికి పోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తగుదునమ్మా అంటూ హస్తిన వీధుల్లో వీరంగం వేస్తున్నారు. దొంగతనం చేయడం నేరం కానట్లు ఆయన, ఆయన చుట్టూ ఉన్న వందిమాగధులు మాట్లాడుతున్నారు. దొంగను పట్టుకోవడమే నేరమన్నట్లు ఉంది వారి వ్యవహారం. ‘‘అన్ని రకాల సాక్ష్యాలున్నా చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఆయన్ని ఎ-1గా ఎందుకు చేర్చడం లేదు’’ అని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తుండడంతో తెలుగుదేశం నాయకులు గంగవైలెత్తిపోతున్నారు. రాష్ర్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్లకు పరిస్థితి వివరించడంతో పాటు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని జగన్మోహన్రెడ్డి కోరుతుండడంతో చంద్రబాబు హడావిడిగా హస్తినకు పరుగుపెట్టారు. 
  • చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు? అడ్డంగా దొరికిపోయాను... కానీ ఆ వాయిస్ను పరిగణనలోకి తీసుకోకుండా, ఎఫ్.ఐ.ఆర్.లో తన పేరు లేకుండా, చార్జి షీట్లో తన పేరు లేకుండా ఒత్తిడి తీసుకు రావటానికి, వ్యవస్థల్ని మేనేజ్ చేయటానికి వెళ్ళిన మాట వాస్తవం కాదా? 
  • చంద్రబాబునాయుడుకు ఏ కొంచెం నీతి - నిజాయితీ ఉంటే ఇప్పుడు కేంద్రం కాళ్ళుపట్టుకోకుండా, వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోకుండా, నిజాయతీగా దర్యాప్తుకు సహకరించాలి. ఓటుకు కోట్లు ఉదంతంలో అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలి. 
  • పోలీసుల దగ్గర, కోర్టు దగ్గర ఉండాల్సిన టేపులు మీడియాకు ఎలా వచ్చాయని అడుగుతున్న తెలుగుదేశం పార్టీ దివాలా కోరు వాదనల్ని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తోంది. అంటే దీని అర్థం చంద్రబాబు నేరగాడే. కానీ, ఆ నేరం రికార్డుల్ని బయట పెట్టటానికి వీల్లేదని తెలుగుదేశం పార్టీ ప్రెస్మీట్లు పెడుతోందంటే టీడీపీకి అర్థం తెలుగు దేశం పార్టీ అనా? తెలుగు దొంగల పార్టీ అనా?
  • ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రించటానికి, ఏపీ ప్రజల్ని రెచ్చగొట్టటానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తున్నందువల్ల తక్షణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బర్త్ఫ్ ్రచేసి ఏపీలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ఇటు గవర్నర్మీద, అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది తెలుగు జాతి సమస్య కాదు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రోజు తెలుగు జాతికి సమస్య. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి పరువును తీసిన వ్యక్తి ఆయన. అడ్డంగా దొరికి వారం అవుతున్నా ఈ రోజుకూ రాజీనామా చేయకుండా రాష్ట్రం పరువును, తెలుగు ప్రజల పరువును బజారుకు ఈడుస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం రెండు రాష్ట్రాల ప్రజలమీద గౌరవం ఉన్నా, ఏపీ అభివృద్ధిని ఆయన కోరుకుంటున్నా... తక్షణం రాజీనామా చేసి దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి. 
  • చంద్రబాబు నాయుడిది స్కీముల ప్రభుత్వం కాదు... స్కాముల ప్రభుత్వం. చంద్రబాబు ఒకటి కాదు... రెండు కాదు... డజన్ల కొద్దీ స్కాముల్లో వేల కోట్లు గుంజుకుని వేరే రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పథకానికి శ్రీకారం చుట్టారు.
  • తెలంగాణలోనే కాకుండా, మరో రెండు రాష్ట్రాల్లో కూడా ఏపీలో దండుకున్న అవినీతి సొమ్మును ఖర్చు చేసి ఓట్లు, సీట్లు కొనటం ద్వారా తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చంద్రబాబు మార్చాలని వ్యూహం వేశాడు. అందులో భాగంగానే మొన్నటి మహానాడులో తనను తాను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చటానికి ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. స్కాములే స్కీములుగా పరిపాలిస్తున్నాడు.
  • తాను ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదు అని చెప్పడు. వైస్రాయ్లో తాను ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదు అని చెప్పడు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి దొంగ దారిలో అధికారం పొందాను అని చెప్పడు. ఎన్టీఆర్ నుంచి మొదట పార్టీని లాక్కున్నాడు. తరవాత అధికారం లాక్కున్నాడు. పార్టీ గుర్తును లాక్కున్నాడు.ఆ తరవాత ఆయన శవాన్ని లాక్కున్నాడు. చివరికి ఆయన ఫొటోనీ, విగ్రహాన్నీ కూడా లాక్కున్నాడు. ఇప్పుడు దొరికిపోయేసరికి ఎన్టీఆర్ గుర్తుకు వస్తున్నాడు. 
  • అన్నింటిలో చంద్రబాబు నాయుడుది ఇదే పద్ధతి. మొదట తెలంగాణను విడగొట్టండి అని తన పాలిట్ బ్యూరోతో ఏకగ్రీవ తీర్మానం చేయించి, లెటర్ అక్టోబర్ 18, 2008 నాడే.... టీఆర్ఎస్ కంటే ముందే ఇచ్చాడు. ఆ తరవాత, 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్తో జట్టుకట్టి, మహా కూటమి అని పెట్టి వేరే రాష్ట్రంగా విడగొట్టండి అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ప్రతి మహానాడులో తీర్మానం చేశాడు.... చివరికి వైఎస్సార్గారి మరణం తరవాత రోశయ్య జరిపిన సమావేశంలో కూడా తెలంగాణ ఇవ్వండి అని కోరి.... పార్లమెంటులో ఆ రోజున వారి ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీని విడగొట్టండి అని ఓటు వేయించాడు... సీఎం అయిన తరవాత మహబూబ్నగర్గానీ, తెలంగాణ జిల్లాల్లో గానీ పర్యటిస్తున్నప్పుడు తెలంగాణ తనవల్లే వచ్చిందని, మొదటి తీర్మానం తామే చేయటంతో పాటు మొదటి ఓటు తామే వేశామని చెప్పినవాడు మన సీఎం చంద్రబాబు నాయడు. ఈయన మన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సీఎం. ఈయనది రెండు కళ్ళ సిద్ధాంతం. రెండు నాలుకల ఆచరణ. 
  • ఇప్పుడూ అంతే. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడు. కొనుగోలు చేయండని చెప్పాడు. రేవంత్ను వలపన్ని తెలంగాణ ఏసీబీ పట్టుకుంది. కొనుగోలు చేయటానికి వెళ్ళినవాడు దొరికాడు. కొనుగోలు చేయించటానికి పంపినవాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నాయుడు గారు ఏం చేస్తున్నారు? దొంగతనం చేయటం తప్పు కాదు... దొంగతనం చేస్తున్నప్పుడు పోలీసులే పట్టుకోవాలి. అది కూడా మా డీజీపీ కింద ఉన్న మా పోలీసులే పట్టుకోవాలి. అది కూడా నన్ను పట్టుకోటానికి వీల్లేదు. అంటూ ట్యాపింగ్ తప్పు అని ఏకంగా కేబినెట్ తీర్మానాలు చేయిస్తున్నాడు. 
  • చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఏమిటంటే... అక్రమ ఆస్తులన్నీ లోకేశ్కు. తన తప్పుల్లో వాటా మాత్రం ప్రజలకు. ఇదీ చంద్రబాబుగారి వీలునామా. అవినీతి ఆస్తులు తనవి. కేసులన్నీ మనవి. కొంచెం కూడా సిగ్గుపడడు. కాబట్టే మంగళగిరి సభలో తన దొంగతనాన్ని, తన లంచగొండి తనాన్ని సమర్థించుకుంటూ.... తనమీద ఈగవాలితే, అది మొత్తంగా అయిదున్నర కోట్ల ఏపీ ప్రజలకు జరిగిన అవమానంగా భావించండి అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. 
  • దొంగ దొరికిపోయేసరికి వెన్నుపోటు పొడిచి దింపేసిన ఎన్టీఆర్ పేరు పదే పదే గుర్తొచ్చింది. ఎన్టీఆర్ గుండె ధైర్యం తనకు ఉందంటాడు. ఎన్టీఆర్ది కంచు కంఠం అంటాడు. ఎన్టీఆర్ను తానే దింపేశానని మాత్రం చెప్పడు. రేవంత్ రెడ్డిని ట్రాప్ చేశారంటాడు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చింది తాను అని మాత్రం చెప్పడు. బాధ్యత తనదేనని ఒప్పుకోడు. ఏ-1 తానే అని అంగీకరించడు. ఎన్టీఆర్ మరణానికి బాధ్యుడ్ని తానే అని ఒప్పుకోడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళటానికి బాధ్యుడ్ని తానే అని ఒప్పుకోడు. ఎన్టీఆర్ విగ్రహానికి మెడలో దండ వేస్తాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఫంక్షన్కు అటెండ్ అవుతాడు. కాకపోతే రేవంత్ తన పేరు చెప్పేస్తే తన చాప్టర్ క్లోజ్ అని తెలుసు కాబట్టి ఇప్పుడు ఏకంగా మంత్రులందర్నీ ఆదేశిస్తాడు, రేవంత్రెడ్డి ఇంట్లో ఫంక్షన్కు అటెండ్ కావాల్సిందేనని. ఇది రేవంత్ రెడ్డి మీద ప్రేమా? కాదు. భయం. రేవంత్ రెడ్డి తన పేరు ఎక్కడ చెప్పేస్తాడో అనే భయం.
Back to Top