రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు..!


హైదరాబాద్:  పెరిగిన నిత్యవసర ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు నిర్వహించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ శ్రేణలు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాచేపట్టాయి. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగించాయి. ధరలను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు.

అనంతపురం:
రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అనంతపురంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

గుంటూరు:
పెరిగిన ధరలకు నిరసనగా జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరి పేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మంగళిగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు. గుంటూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో  వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి , ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు.
ప్రకాశం..
మార్కాపురంలో ఎమ్మెల్యే వెంకట్ రెడ్డ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద  ధర్నా చేపట్టారు. చీరాలలో  వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ తీశాయి. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. చినగంజాంలో గొట్టిపాటి భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.

వైఎస్ఆర్ జిల్లా.. 
నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వం వైపల్యాన్ని నిరసిస్తూ .... కమలాపురంలో పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  వెంటనే ధరలు తగ్గేలా  చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్వో రామ్మోహన్‌కు వినతిపత్రం సమర్పించారు.

పశ్చిమగోదావరి: 
రాష్ట్రంలో మంటెత్తిస్తున్న ధరలపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గమన్నాయి. పాలకొల్లులో పార్టీ ఎమ్మెల్సీ మేకాశేషుబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్వో దాచిరాజుకు వినతిపత్రం సమర్పించారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కొవ్వూరులో వనిత ఆధ్వర్యంలో ధర్నా, నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. 

తూర్పుగోదావరి జిల్లా..
రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అనపర్తిలో సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. అమలాపురంలో చిట్టబ్బాయి, విశ్వరూప్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పిఠాపురంలో పెండెం దోరబాబు, మండపేటలో పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో, కడియంలో గిరిజాల వెంకటస్వామినాయుడు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. 

కృష్ణా..
మైలవరంలో జోగిరమేష్ , పామర్రులో ఉప్పులేటి కల్పన, గన్నవరంలో రామచంద్రారావు , నందిగామలో రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. ధరలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. నూజివీడులో ఎమ్మెల్యే ప్రతాప అప్పారావ్ ఆధ్వర్యంలో భైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాచేపట్టారు. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.

చిత్తూరు జిల్లా..
ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ చంద్రగిరిలో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సత్యవేడులో కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి, రాస్తారోకో నిర్వహించారు. పలమనేరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.

నెల్లూరు జిల్లా..
ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , కోటలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో..ధరలను కట్టడి చేయాలని కోరుతూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 

కర్నూలు జిల్లా..
కోరుమూడులో ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఎమ్మిగనేరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. 

విజయనగరం:
వైఎస్ఆర్సీపీ నేత బేబినాయన ఆధ్వర్యంలో బొబ్బిలిలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట  ధర్నా చేపట్టారు.
Back to Top