రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ జయంతి

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 63వ జయంతి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. వైఎస్ఆర్ కుటుంబీకులు ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైన వైఎస్ సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, వారి కుమార్తె షర్మిలలు ఉద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మహానేత చెరగని చిరునవ్వును, పేద ప్రజల సంక్షేమానికి తపించిన తీరును అంతా గుర్తు చేసుకున్నారు.సమాధి స్థలి దగ్గర ప్రార్థనల తర్వాత కుటుంబ సభ్యులంతా ఘాట్‌ ప్రాంగణంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని సందర్శించారు. విగ్రహానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. విజయమ్మ, షర్మిలలతోపాటు బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ భారతి, వైఎస్ పురుషోత్తంరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కమలమ్మ, విమలమ్మ తదితరులతోపాటు భారీ సంఖ్యలో అభిమానులు మహానేతకు నివాళులర్పించినవారిలో ఉన్నారు.విజయమ్మ, షర్మిలల రక్తదానంఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో వైఎస్ అభిమానులతోపాటుగా.. విజయమ్మ, షర్మిలలు కూడా రక్తదానం చేశారు. అంతకుముందు తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వి.ఆర్.రామిరెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ను వైఎస్ విజయమ్మ ప్రారంభించారు.పార్టీ కార్యాలయంలో..హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమానికి గట్టు రామచంద్రరావు, వైవీ.సుబ్బారెడ్డి, శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.జిల్లాల్లోనూ వైఎస్ కు ఘనంగా నివాళులుహైదరాబాద్, ఇడుపులపాయల్లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానాలు, పండ్లు, చీరలు, దుప్పట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్ సీపీ నేతలే కాక, భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.సీఎల్పీలో నామమాత్రంగా వైఎస్ఆర్ జయంతిహైదరాబాద్: వైఎస్‌ఆర్ జయంతిని సీఎల్పీలో నామమాత్రంగా నిర్వహించారు. వైఎస్‌ చిత్రపటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, ఎంపీ కేవీపీ రామచంద్రరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీ లాబీలో నిర్వహించిన వైఎస్‌ జయంతికి స్పీకర్ నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, ఎంపీలు తదితరులు హాజరయ్యారు.అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటు: మారెప్పన్యూఢిల్లీ: తన రెక్కల కష్టంతో రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గు చేటని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మారెప్ప తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏపీ భవన్‌ ప్రాంగణంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు నిర్వహించిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో మారెప్ప పాల్గొన్నారు.

Back to Top