వైయస్ఆర్ కడప: ప్రొద్దుటూరు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. వైయస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో నామాలగుండు వద‍్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాచమల్లు ప్రసాదరెడ్డి సహా ఆయన కుటుంబసభ‍్యులు గాయపడ్డారు.<br/>ప్రసాదరెడ్డి కుటుంబ సమేతంగా కారులో పులివెందుల మీదుగా బెంగుళూరుకు వెళుతుండగా ఎదురుగా వస్తున‍్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో శాసనసభ‍్యుడు, ఆయన కుటుంబసభ‍్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున‍్న పులివెందుల పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని పులివెందుల ఆస‍్పత్రికి తరలించారు.<br/>