రాయగూడెం నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

ఖమ్మం, 23 ఏప్రిల్ 2013:

ఖమ్మం జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను రెండో రోజు ప్రారంభమైంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర వల్లభి గ్రామం వద్ద సోమవారం సాయంత్రం ఖమ్మం జిల్లాలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ఆమె నేలకొండపల్లి మండలం రాయిగూడెం నుంచి యాత్రను ఆరంభించారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర కట్టు కాచారం క్రాస్‌రోడ్, బుద్ధారం, బుద్ధారంకాలనీ, చెరువు మాదారం వరకు సాగనుంది. ఆమె ఈరోజు మొత్తం 13.9 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.

Back to Top