రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు

హైదరాబాద్:

తెలంగాణ అంశంపై రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు ధ్వజమెత్తారు. శుక్రవారం వారు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై టీడీపీ, కాంగ్రెస్ గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితికి కారణమైన రెండు పార్టీలూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మంత్రులు ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశంపై అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Back to Top