రాజన్న ఉంటే ఇలాగ అయ్యేది కాదు

ఉంగుటూరు:

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడులో బుడమేరు నీటి ముంపునకు గురయిన ప్రాంతాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సోమవారం నాడు సందర్శించారు. కొయ్యగూరపాడు గ్రామంలో బాధితులను పరామర్శించారు. నీట మునిగిన వరి పొలాలను ఆమె పరిశీలించారు. ఏ మేరకు నష్టం వాటిల్లిందీ స్థానిక రైతులు ఆమెకు వివరించారు. నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో ప్రజలు ఆదుకోవాలనీ, వారికి భరోసా కల్సించాలనీ ఆమె పార్టీ కార్యకర్తలకు  పిలుపునిచ్చారు. ఆమె వెంట పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాధ రెడ్డి, కొడాలి నాని, తదితరులున్నారు. తొలుత విజయమ్మ హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి కారులో పరిశీలనకు బయలుదేరారు. గ్రామమంతా ఆమెను చూసేందుకు తరలివచ్చింది. మొత్తం ఐదు లక్షల  ఎకరాల్లో పంట ముంపునకు గురయ్యింది. ఆదివారం రాత్రి విజయమ్మ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు రైతులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. కొడాలి నాని ముందుకొచ్చి పదివేల మంది రైతులకు ఆహార పొట్లాలను అందించారు. ప్రమాదకర పరిస్థితులు ఇంకా తొలగలేదని రైతులు చెబుతున్నారు.   ఈ ప్రాంతంలో వరి మొత్తం నీటిలో మునిగి ఉంది. ఇప్పటికే వరి పనలు కుళ్ళిపోతున్నాయనీ, మరో రెండు రోజులుంటే పెట్టుబడి కూడా రాదనీ రైతులు ఆమెకు తెలిపారు. చెరువులను తలపిస్తున్న పొలాలను ఆమె చూశారు. వైయస్ఆర్ ఉండి ఉంటే బుడమేరు ముంపునుంచి తమను కాపాడి ఉండే వారని రైతులు గుర్తుచేసుకున్నారు.ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడతామని విజయమ్మ వారికి భరో్సా ఇచ్చారు. వైయస్ లేనందు వల్లే ఇలాంటి దుస్థతి ఏర్పడిందని ఆమె చెప్పారు.

Back to Top