రాజన్న రాజ్యాన్ని ఆకాంక్షిస్తున్న ప్రజలు

విజయనగరం:

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా రాజన్న రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు చెప్పారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు చేస్తున్న కుయుక్త రాజకీయాలు చూసి అసహ్యించుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే  శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రాజన్న రాజ్యాన్ని మరలా సాధించుకోవచ్చన్నారు. ఎల్. కోట మండలం కాశీపేట గ్రామానికి ఎన్‌ఆర్‌ఐ కోళ్ల గంగా భవానీ నేతృత్వంలో 70 కుటుంబాలు కాంగ్రెస్, టీడీపీలను వీడి వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. వీరికి పెనుమత్స సాంబశివరాజు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రజా సమస్యలను గాలికొదిలి పదవుల కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫలితంగా అన్ని వర్గాల ప్రజలూ సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top