ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లోకి విద్యావ్యవస్థ

విద్యావ్యవస్థ తాకట్టు 
అంబేద్కర్ ఆశయాలకు తూట్లు  
మంత్రి గంటా, నారాయణల కోసమే బిల్లు 

గుంటూరుః
చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు దాసోహమై విద్యావ్యవస్థను తాకట్టు
పెడుతున్నారని వైఎస్సార్సీ నేత లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో
ప్రతిపక్షం లేని సమయంలో హడావుడిగా బిల్లులు పెట్టడం దారుణమన్నారు. విద్యను
ప్రైవేటీకరణ వైపు తీసుకుపోతూ చంద్రబాబు  అంబేద్కర్ ఆశయాలకు తూట్లు
పొడుస్తున్నారని అప్పిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీ
బిల్లు పెట్టిన తీరు చూస్తుంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న
విధంగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. 

మంత్రి
 గంటా శ్రీనివాసరావు ఆయన వియ్యంకుడు మంత్రి నారాయణ కోరిక మేరకు చంద్రబాబు విద్యను
ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లో పెడుతున్నారని అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.
ఇందుకోసమే  ప్రైవేటు యూనివర్సిటీలకు తలుపులు బార్లా తెరుస్తున్నారని
మండిపడ్డారు. అసెంబ్లీలో అంబేద్కర్ పేరును వాడుకొని చర్చకు అడ్డుపడ్డ
చంద్రబాబు ....ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు పేరుతో  మరోసారి ఆయన్ను
అవమానపరుస్తున్నారని అప్పిరెడ్డి ఫైరయ్యారు. దేశంలో అణగారిన వర్గాల వారు
ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టారన్నారు.
ప్రైవేటు యూనివర్సిటీలు వస్తే  రిజర్వేషన్లకు అవకాశం లేకుండా పోతుందని ఆయన
ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రైవేటు విద్యాసంస్థలు
ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా చంద్రబాబు దాన్ని నియంత్రించని
పరిస్థితి ఉందని అప్పిరెడ్డి ఎద్దేవా చేశారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 112 ప్రైవేటు
యూనివర్సిటీలు  వ్యాపారపరంగా కొనసాగుతుంటే... సుప్రీంకోర్టు వాటిని
మూసేయాలని ఆదేశాలిచ్చిన విషయం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు
ఎవరికోసం బిల్లు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా
ఉన్నలక్ష 42 వేల పోస్ట్ లను భర్తీ చేయడం లేదు. కొత్తగా తీసుకొచ్చిన
బిల్లుతో ఎవరిని ఉద్దరిస్తావని నిలదీశారు.  నూతనంగా ఏర్పడిన ఆంధ్ర
రాష్ట్రంలో 18 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలున్నాయని, మరో 11 జాతీయస్థాయి
విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయని అప్పిరెడ్డి చెప్పారు. ఇలాంటి
పరిస్థితుల్లో అవసరం లేకున్నా రాష్ట్రానికి  ప్రైవేటీ యూనివర్సిటీ బిల్లు
తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top