మళ్లీ నాన్నగారి పాలన తీసుకువస్తా

– బనగానపల్లెలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
–మీ పిల్లలను నేను చదవిస్తాను
– మీరు బడికి పంపిస్తే.. మీ అన్న ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాడు.
– ఫీజులన్నీ నేనే చెల్లిస్తా
– అవ్వతాతలకు ఎంత చేసినా తక్కువే
– రైతులకు మే, జూన్‌లోనే ఏడాదికి రూ.12500 ఇస్తా
– పేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తా
– చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చారా?
–బాబు ఇచ్చిన రుణమాఫీ కనీసం వడ్డీకి సరిపోవడం లేదు
– రాష్ట్రాన్ని అప్పుల్లో, అవినీతిలో నంబర్‌ వన్‌ చేశారు
– జననేత రాకతో జనసంద్రమైన బనగానపల్లె

కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మళ్లీ తీసుకువస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హమీ ఇచ్చారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం ఇంచు అభివృద్ధి కూడా జరగలేదని, రాష్ట్రాన్ని అప్పుల్లో, అవినీతిలో నంబర్‌ వన్‌ చేశారని మండిపడ్డారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకువచ్చేందుకు, ప్రజలకు తోడుగా నిలిచేందుకు తాను ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నట్లు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన మొదలుపెట్టిన పాదయాత్ర ఆదివారం బనగానపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. సాయంత్రం బనగానపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది తరలివచ్చారు. జననేతకు ఘన స్వాగతం పలికారు. జనం రాకతో బనగానపల్లె పట్టణం జనసంద్రమైంది. ఈ సందర్భంగా అశేష జనవాహినిని ఉద్దేశించి జననేత ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

–  ఇవాళ వేల అడుగులు నాతో పాటు నడిచి, ఇక్కడ కొన్ని వేల మంది పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ తనకు తోడుగా నిలిచేందుకు అన్నా.. నీ వెనుకాలా ఉన్నమని సంకేతం ఇచ్చేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు.
–నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనలో మనం పడుతున్న బాధలపై, అవస్థలపై ఇవాళ సమర శంఖారావం ఊదుతూ పాదయాత్ర మొదలుపెట్టాం. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూశాం. ఒక్కసారి మన గుండెలపై చేయ్యి వేసుకొని మనకు ఎలాంటి పరిపాలన కావాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నాలుగేళ్ల పాలనలో మనకుగానీ, మన ఇంటికి, రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగిందా? అని మిమ్మల్ని అడుతున్నాను.
– ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారు. టీవీల్లో ఏం చెప్పారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. ఏ ఒక్క వాగ్ధామైనా నెరవేర్చారా? 
–ఆ రోజు రైతుల రుణాలు బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రుణమాఫీ అనే పథకం నాలుగేళ్ల తరువాత కనీసం వడ్డీకి కూడా సరిపోవడం లేదు. ఇది న్యాయమేనా. మీ బంగారం ఇంటికి వచ్చిందా?
–ఇదే పెద్ద మనిషి ఆడవాళ్లను మోసం చేశారు. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్ధానం చేశారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా?
–జాబు కావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికి రూ.2 వేలు ఇస్తామని చెప్పాడు. 45 నెలలు అవుతుంది. ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డాడు.
– ఇదే ముఖ్యమంత్రి నాలుగేళ్ల క్రితం ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. కనీసం ఒక్క  ఇల్లు అయినా కట్టించాడా?
– నాలుగేళ్ల క్రితం కరెంటు బిల్లు ఎంత వచ్చేది. ఇవాళ ఎంత వస్తుంది. రూ.500, 600, 1000 ఇలా పెంచుకుంటూ పోతున్నారు. కరెంటు బిల్లు పెంచను, తగ్గిస్తానని చంద్రబాబు అన్నారు. 
– గతంలో రేషన్‌ షాపుల్లో బియ్యం, కందిపప్పు, చక్కెర, కిరోసిన్, పామాయిల్, గోదుమలు ఇచ్చే వారు. ఇప్పుడు బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు.
– ఎన్నికలప్పుడు  ఓట్ల కోసం చేసిన మాటలేంటీ. ఏ సామాజిక వర్గాన్ని వదల్లేదు. బోయలను ఎస్టీలుగా చేస్తాననన్నారు. రజకులను ఎస్టీలుగా చేస్తానన్నారు. మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. ఏ మతాన్ని వదల్లేదు. నాలుగేళ్ల తరువాత ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో మాట్లాడుతూ..2022 నాటికి రాష్టాన్ని ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ చేస్తా అంటున్నారు. 2050 నాటికి అన్నింటికన్నా నంబర్‌ వన్‌ చేస్తానని చెబుతున్నారు. ఎవరైనా మీ గ్రామంలో సర్పంచ్‌ ఉంటాడు. మీ సర్పంచ్‌ 2022కు వాటర్‌ ట్యాంకు కట్టిస్తాను. 2050 నాటికి రోడ్డు వేయిస్తానంటే మీ సర్పంచ్‌ ఏమంటారు. మెంటల్‌ కేసు సర్పంచ్‌ అంటారు కదా. ఇదే చంద్రబాబు ఇవాళ నోరు తెరిస్తే ఆయన 2022, 2029 అంటున్నారు.  ఇప్పుడే ఆయన వయస్సు 70 సంవత్సరాలు, 2029 అంటే 80 ఏళ్లు దాటిపోతుంది. ఇవాళ ఏం చేస్తున్నారో చెప్పరు కానీ, 2029, 2050 అంటున్నారు. 
– ఇవాళ రాష్ట్రాన్ని చాలా వాటిల్లో నంబర్‌ వన్‌ చేశారు. రైతులను, రాష్ట్రాన్ని అప్పుల్లో నంబర్‌ వన్‌ చే శారు. అవినీతిలో నంబర్‌ వన్‌ చేశారు. అబద్ధాలు ఆడటంలో నంబర్‌వన్‌ చేశారు. మద్యం అమ్మకాల్లో నంబర్‌ వన్‌చేశారు.
–చిన్న పిల్లలను గొప్ప గొప్ప చదువులు చదివించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తే..ఆ ఫీజులను ఎగ్గోట్టడంలో, పెంచడంలో చంద్రబాబు నంబర్‌ వన్‌ చేశారు.
– ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా వైయస్‌ఆర్‌ చేస్తే..చంద్రబాబు అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌గా చే శారు. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారు. మీరు హైదరాబాద్‌కు వెళ్తే వైద్యం అందదట. చంద్రబాబు, ఆయన కొడుకు అమెరికా వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. పేదోళ్లు హైదరాబాద్‌ పోకూడదట. ఇంతదారుణంగా కత్తిరింపులు చేపట్టారు.
–బనగానపల్లె నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. శనగ పంటకు గిట్టుబాటు ధర లేదు. రూ.4 వేలకు కొనే వారు లేరు. పంటలు అమ్ముకునేందుకు రైతులు తలలు పట్టుకుంటున్నారు. పత్తి, మిర్చి, వేరుశనగకు గిట్టుబాటు ధర లేదు. 
–బనగానపల్లె మామిడి పండుకు ఫేమస్‌. ఈ పండుకు గిట్టుబాటు ధర లేదు.
– మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి, టమోటలు, ఉల్లి రోడ్డుపై తొక్కుతున్నారు. ఇదే నియోజకవర్గంలో గోరుకల్లు ప్రాజెక్టులో మాములుగా 12 టీఎంసీల నీరు నిల్వ చేయాలి. ఇప్పటి వరకు 2, 3 టీఎంసీల కన్న ఎక్కువ నీరు నిల్వ చేయడం లేదు.
– దివంగత ముఖ్యమంత్రి 80 శాతం ప్రాజెక్టులు పూర్తి చేస్తే..నాలుగేళ్లలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదు.
–పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తెచ్చేందుకు విస్తరణ పనులను వైయస్‌ఆర్‌ చేపట్టారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రాజెక్టుల్లో నీరు లేవు.
– రాయలసీమలో ఉన్నప్పుడు కోస్తాంధ్ర గురించి బ్రహ్మండంగా చెబుతారు, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ గొప్పగా చెబుతారు.
– ఇటీవల తన ఎమ్మెల్యేలను పోలవరం తీసుకెళ్లి పట్టిసీమ కట్టి రాయలసీమకు నీళ్లు ఇచ్చాడని చెప్పారు. పట్టిసీమ ఎక్కడ ఉంది, రాయలసీమ ఎక్కడ ఉంది. బొంకడం చంద్రబాబుకు అలవాటు.
– నాగార్జున సాగర్‌ కుడికాల్వకు 140 టీఎంసీల నికర జలాల అలాట్‌మెంట్‌ ఉంది. అయితే అక్కడ  ఇంతవరకు వరి సాగు చేయడం లేదు. పక్కన తెలంగాణలో ప్రతి ఏటా వరి వేస్తున్నారు. మన ఖర్మ ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం. నోరు తెరిస్తే అబద్ధాలు..ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలా?
– రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవ్వతాతలకు పింఛన్లు రావడం లేదని దారిపొడుగునా అడుగుతున్నారు. చదువుకుంటున్న పిల్లలు, ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నురు. వారందరికి తోడుగా నిలిచేందుకు ఇవాళ పాదయాత్ర చేస్తున్నాను. అక్క చెల్లెమ్మలు విలవిలలాడుతున్నారు. ఒక్క రూపాయి మాఫీ కాలేదు. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు అందడం లేదు.
–ఇటువంటి పాలన పోవాలి. రేపొద్దున ఎటువంటి పాలన రావాలంటే..రేపొద్దున ఇలాంటివి చేస్తానని మాట ఇచ్చి చేయకుండపోతే తన పదవికి రాజీనామా చేసి వెళ్లాలి. రాజకీయ వ్యవస్థ చెడిపోయింది. ఎవరైనా అబద్ధం అడుతున్నారు. ఇలాంటి వారిని ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలు ఉన్నారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి.
– చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికే మీ అందరి తోడుగా నిలబడాలని, మీ ముద్దు బిడ్డను ఆశీర్వదించాలని మీ అందర్ని కోరుతున్నాను.
– నవరత్నాలు ఇదివరకే ప్రకటించాను. ఆ 9 నవరత్నాలలో ఒక్కదాని గురించి ఇక్కడికి వస్తున్నప్పుడు జరిగిన పరిణామాలను చెబుతున్నాను. పిల్లలను చదివించలేని పరిస్థితిలో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచేందుకు, పేదరికం నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నాను. 
– నాన్నగారి స్పూర్తిగా మీ పిల్లలను బడులకు పంపించండి. సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తానని చెబుతున్నాను. ఆ పిల్లలు చదవాలి. మన పరిస్థితులు మెరుగు పడాలంటే వారు చదవాలి. మీ అన్న ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాడు.
– ఇంజనీరింగ్‌ చదవాలంటే ఏడాదికి లక్ష రూపాయల ఫీజు ఉంది. చంద్రబాబు రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన ఫీజుల కోసం పేదవాడు సతమతమవుతున్నాడు. వారందరికి చెబుతున్నాను. మీ పిల్లలను చదివించండి. వారిని నేను చదవిస్తాను. ఫీజులు ఎంతైతే ఉంటాయే, ఆ మొత్తం నేను చెల్లిస్తానని మాట ఇస్తున్నాను. వారు అక్కడ ఉండి చదవడానికి, తినడానికి ఏటా రూ.20 వేలు ఇస్తానని మాట ఇస్తున్నాను. ఒక్క రూపాయి కూడా ఇబ్బంది పడకుండ ఉండడానికి చదువుల విప్లవం తీసుకువస్తున్నాం.
– అవ్వతాతల కోసం రూ.2 వేల పింఛన్‌ ఇస్తానని చెబుతున్నాను. ఇంతేకాదు..ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అందరికి చెబుతున్నాను. 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాను. ఈ రెండు చేస్తేనే కనీసం బతడం ఈజీగా ఉంటుంది.
– ఇంకా ఏడాది ఉంది కదా? చంద్రబాబు కూడా రెండు వేలు ఇస్తాడన్నా ..అని చాలా మంది చెబుతున్నారు. వైయస్‌ జగన్‌ ఈ మాట అన్నాడు కాబట్టి చంద్రబాబు పింఛన్‌ పెంచాడు అనుకుంటారు. ఆయన రూ.2 వేలు ఇస్తే..నేను రూ.3 వేలు ఇస్తాను. అవ్వతాతలకు తోడుగా నిలిచేందుకు ఎంత చేసినా తక్కువే.
– చంద్రబాబు ఇక్క ఇల్లు కూడా కట్టించలేదు. మళ్లీ నాన్నగారి పాలన తీసుకువస్తా. ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చేస్తా. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టిస్తాను.
– రైతులకు చెబుతున్నాను. మీ అందరి ఆశీస్సుల వల్ల మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత గిట్టుబాటు ధర లేదని ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. పంట వేసే ముందే శనగ రూ.8 వేలకు ప్రభుత్వం కొంటుంది. ఏ పంటకు ఏ రేటు గిట్టుబాటు ధర ఉంటుందని ముందే చెబుతాం. ఇందుకోసం రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.
– ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అప్పులు పుట్టవు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. ఆ ప్రతి రైతుకు ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు రూ.12500 మే, జూన్‌ మాసంలోనే ఇస్తాం.
–చంద్రబాబు మ్యానిఫెస్టో మాదిరిగా కట్టకట్టలుగా ఉండదు. మన మ్యానిఫెస్టో కేవలం రెండు, మూడు పేజీల్లో ఉంటుంది. మీ వద్ద నుంచి వచ్చిన సలహాలు, మీరు దిద్దిన మ్యానిఫెస్టోను ప్రవేశపెడుతాం. 2019 ఎన్నికలకు వెళ్తాం. ఆ తరువాత 2024లో ఆ మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని చేసి చూపిస్తాం. చెప్పనివి కూడా చేసి చూపిస్తా అని మీ అందరికి మాట ఇస్తున్నాను. 
– ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకువస్తా. ఇందుకోసం మీ అందరి సలహాలు కోరుతున్నాను. దద్దనాల చెరువుకు నీరు తీసుకువస్తాను.
– ఈ ప్రాంతానికి మేలు చేసేందుకు గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వలసలు నివారించేందుకు చర్యలు తీసుకుంటాను. 
– ఈ ప్రజా సంకల్ప యాత్రలో మీ అందరి సలహాలు, సూచనలు కోరుతూ, మీ అందరి ఆశీస్సులు కోరుతూ..మీ ముద్దుల బిడ్డను ఆశీర్వదించాలని సెలవు తీసుకుంటున్నాను.
 
Back to Top