'ప్రజల నుంచి జగన్‌ను వేరు చేయలేరు'

గుంటూరు సెంట్రల్:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపించారని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు రావి వెంకటరమణ ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీలు కలసి సీబీఐ చేత కేసులు పెట్టినా ప్రజల హృదయాల నుంచి శ్రీ జగన్మోహనరెడ్డిని ఎవరూ వేరుచేయలేరన్నారు.  శ్రీ జగన్మోహనరెడ్డి కేసు విషయంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కోటి సంతకాలతో కూడిన లేఖను అందజేయనున్నామన్నారు.

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆదివారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావి వెంకటరమణ మాట్లాడుతూ.. సీబీఐ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తంచేశారు.  ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి శ్రీ జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top