జగన్ దీక్ష విరమించాలి: పొత్తూరి

హైదరాబాద్ 30 ఆగస్టు 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ  నిరాహార దీక్షను వెంటనే విరమించాలని సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓ  లేఖ రాశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని  అభిమానించే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దీక్ష ద్వారా ఆరోగ్యం దెబ్బ తింటే అభిమానులు  తీవ్రంగా కలత చెందుతారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి  ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నట్లు వివిధ పత్రికల్లో చదివినట్లు ఆయన తెలిపారు. సెలైన్ తీసుకోవడానికి సైతం శ్రీ జగన్ నిరాకరించారని తెలిసి  ఆవేదన కలిగిందని పొత్తూరి వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top