పోటాపోటీగా 'జగన్‌ కోసం.. జనం సంతకం'

ఉదయగిరి (పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి త్వరలోనే జైలు నుంచి బయటకు రావడం తథ్యం అని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటకు రావాలని చిన్నపిల్లల నుంచి అవ్వ, తాతల వరకు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. దీనికి నిదర్శనమే తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణలో పిల్లలు, వృద్ధులు సంతకాలు పెట్టేందుకు పోటీ పడటం  అని అభివర్ణించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి, వరికుంటపాడు, వింజమూరుల్లో జనం సంతకాల సేకరణ కార్యక్రమాల్లో మేకపాటి పాల్గొన్నారు.

శ్రీ వైయస్ జగ‌న్‌పై కుట్రకు వ్యతిరేకంగా ఉదయగిరిలో బుధవారం ‘జగన్‌ కోసం.. జనం సంతకం’లో భాగంగా కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడారు. పాలక పక్షాలు కుట్రపన్ని సిబిఐని వాడుకుని శ్రీ వైయస్ జగ‌న్‌ను 215 రోజులుగా జైలులో అన్యాయంగా నిర్బంధించారని దుయ్యబట్టాన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వైయస్‌ఆర్‌సిపి కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలుస్తామన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఆయనపై తప్పుడు కేసులు బనాయించి అణగదొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందన్నా రు. నిజాలను నిగ్గు తేల్చాల్సిన సిబిఐ శ్రీ జగన్‌ను దోషిగా నిలబెట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తోందని విమర్శించారు. భవిష్యత్తులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పక్షపాతంతో సిబిఐ వ్యవహరిస్తున్న తీరు దేశంలో అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు.
Back to Top