పోలీసుల అత్యుత్సాహం

వైయస్‌ఆర్‌ జిల్లా: స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అక్రమాలకు తెర లేపింది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీని అణచివేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి వైయస్‌ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేయడం, మాట వినకపోతే భౌతిక దాడులకు బరితెగించిన టీడీపీ ఈ సారి మరో వంకతో కుట్రలు మొదలుపెట్టింది. శనివారం కడప నగరంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్యాలయంలో భారీగా నగదు నిల్వలు ఉన్నయని సోదాలు చేసిన పోలీసులకు ఏమీ దొరకకపోవడంతో ఉసురుమని వెనుకకు తిరిగారు.

Back to Top