ప్రజల పక్షాన నిలిచిన ఒకే నాయకుడు జగన్

ఒంగోలు‌, 29 ఆగస్టు 2013:

ప్రజల పక్షాన నిలబడిన ఒకే ఒక్క నాయకుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి అని పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అడ్డగోలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేని గురువారంనాడు ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు తమ తమ పదవులకు రాజీనామాలు చేస్తే విభజన ఆగిపోతుందని అన్నారు. రాజీనామా చేయని నాయకులను తరిమికొట్టాలని ప్రజలకు బాలినేని పిలుపునిచ్చారు. చంద్రబాబు రాజీనామా చేయకపోవటం సిగ్గుచేటు అని బాలినేని విమర్శించారు. పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top