పెరుగుతున్న ఎండ తీవ్రత, అంతే పెరుగుతున్న జనం తాకిడి

గుంటూరు: ఎండల తీవ్రత పెరుగుతున్నా కొద్ది.. పాదయాత్రకు జనం తాకిడికి కూడా పెరుగుతూ వస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి, సత్తెనపల్లి నియోజకవర్గాల నుంచి ప్రజా సంకల్పయాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు పొన్నూరు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మండుటెండను కూడా లెక్క చేయకుండా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజలు కూడా వైయస్‌ జగన్‌ను కలుసుకొని, వారి సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు నాయకుల ద్వారా కాకుండా ప్రజల నుంచే స్వయంగా తెలుసుకొవాలని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చూపిన బాటలోనే ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ నడుస్తున్నారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని దీమా వ్యక్తం చేశారు. 
Back to Top