సదుం: వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు సదుంలో పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. వైయస్‌ఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులకు , అభిమానులకు పంచారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప్రజల అభిమానంతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. సర్పంచ్ సయ్యద్‌బాషా, ఖాజాపీర్, రమేష్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, ఇందాద్, ఇమ్రాన్, ఖమ్రుద్ధీన్, చిన్నరమణ, రామాంజులు, ఇర్పాన్, వెంకటస్వామి, అంజాద్ తదితరులు పాల్గొన్నారు.<br/>