షర్మిలకు అభినందనలు తెలిపిన వైయస్ఆర్ కాంగ్రెస్

హైదరాబాద్ 05 ఆగస్టు 2013: మరో ప్రజా ప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్రను ఎదురైన అడ్డంకులను అధిగమించి పూర్తి చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తోందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నడిచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. తద్వారా తన కీర్తిని, రాజశేఖరరెడ్డిగారి వారసత్వాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు వివరించడంలో మరో ప్రజా ప్రస్థానం సఫలమైందని తెలిపారు. లక్ష్యాన్ని చేరకుండా మధ్యలోనే సద్దుకున్న పాదయాత్రను కూడా చూశామన్నారు.

Back to Top