పదవీ కాంక్షతోనే బాబు కుప్పిగంతులు

తిరుపతి, 1 అక్టోబర్‌ 2012: అధికార కాంక్షతోనే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రకరకాల కుప్పిగంతులు వేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన రేపటి నుంచి చేస్తానంటున్న పాదయాత్ర వెనుక పదవీ కాంక్ష తప్ప మరొకటి కనిపించడం లేదని అన్నారు. ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా చంద్రబాబుని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఎంతమాత్రమూ లేదని ఆయన సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు.

ఆదివారంనాడు తిరుపతిలో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరం చెత్తకుప్పల మయంగా మారింది. తిరుపతి డ్రైనేజి పరిస్థితిని సమీక్షించేందుకు భూమన మున్సిపల్ కమిషనర్ ప్రసా‌ద్తో కలిసి‌ సోమవారంనాడు వార్డులలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Back to Top