రాజధానిలో లక్ష కోట్ల భూ దోపిడీ


విజయనగరంః ఐటీదాడులతో రాజధానిలో భూ దోపిడీలు బయటపడుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.అమరావతి రాజధానిగా ప్రకటించక ముందే తమ అనుయూయులతో అతితక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారన్నారు.  సుమారు లక్ష కోట్ల రూపాయాల భూ దోపిడీ జరిగిందన్నారు. భూదోపిడీ అవినీతిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తుంటే రాష్ట్రంలో దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజాకోర్డులో తీర్పు వచ్చే సమయం ఆసన్నమయిందన్నారు. 

Back to Top