బాబు చీప్ మినిస్ట‌ర్‌గా మారిపోయారు

ఏపీ అసెంబ్లీ:   చంద్ర‌బాబు చీఫ్ మినిస్ట‌ర్ కాద‌ని, చీప్ మినిస్ట‌ర్‌గా మారిపోయార‌ని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. రవాణాశాఖ అధికారిపై దౌర్జన్యం చేసిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ ఎదుట వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి దీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా రోజా మాట్లాడుతూ..చంద్రబాబు సెటిల్ మెంట్ల సీఎం అయిపోయారని, ఇటువంటి సీఎం తమకు వద్దని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీయే అధికారిపై దాడి చేసిన సొంత పార్టీ నేతలను ఆయన వెనకేసుకొస్తున్నారని నిప్పులు చెరిగారు. వారు చేసిన తప్పులపై అధికారులతో మాట్లాడి సెటిల్ మెంట్లు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎమ్మార్వో వనజాక్షి, టీడీపీ మహిళా నేత జానీమూన్ విషయంలోనూ ఆయన ఇదే విధమైన సెటిల్ మెంట్లకు పాల్పడ్డారని ఆరోపించారు.

Back to Top