నారాసురుడి పాలనలో అన్నీ కష్టాలే...రుణమాఫీ ఎగొట్టిన ఘనత చంద్రబాబుదే..
దళారీలకు కెప్టెన్‌  చంద్రబాబు..
అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తిట్టాడు..
బాబు వస్తే జాబ్బన్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు..
బొబ్బిలి బహిరంగ సభలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

విజయనగరంః రాష్ట్రంలో పాలన మహిషాసురుడు పాలన తలపిస్తోందని ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం నాడు బొబ్బిలిలో భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు. ఈ  సందర్భంగా ఆయన బాబు పాలను మహిషాసుర పాలనతో పోలుస్తూ పిట్ట కథ చెప్పారు. మహిషాసురుడు ఎక్కడ అడుగుపెడితే అక్కడ చీకటి అవరిస్తుందని, అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కరువు, తుపాన్‌లతో అల్లాడుతుందని విమర్శించారు. బొబ్బిలి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని  ఆరోజుల్లో బొబ్బిలికోటపై అన్యాయంగా యుద్ధం చేశారని పరాయివారితో చేతులు కలిసి వంచనతో తన వారిని చంపివేశారని విజయనగరం అధిపతి విజయరామ గజపతిని తాండ్ర పాపారాయుడు అంతం చేయడం అందరికి తెలిసిందే.. చివరి క్షణల్లో తాండ్ర పాపారాయుడు విజయరామ గజపతిరాజును చంపుతుండగా చివరిగా విజయరామ గజపతి తాండ్రపాపారాయుడిని ప్రలోభపెట్టారని అయినా ఆయన  తలొగ్గలేదని వైయస్ జగన్ వివరించారు. ధర్మం తప్పితే అంతం తప్పదని చరిత్ర మనకు చెప్పుతుందన్నారు.  అదే బొబ్బిలి నేలపై నేడున్న రాజకీయాలు చూస్తే ఒక పార్టీ నుంచి గెలిచి. ఇంకో పార్టీలోకి దూకారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే  ఫిరాయించిన ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కట్టబెట్టడం చూస్తున్నామంటూ విలువలు లేని రాజకీయాలను ఎండగట్టారు. బొబ్బిలి వారసులుగా చెప్పుకునేవారికి విలువలు,విశ్వనీయత, ధర్మం, న్యాయం లేకపోతే ప్రజలకు ఎవరికి దగ్గరకి పోవాలని ప్రశ్నించారు..

తమ  అభివృద్ది కోసమే పార్టీ మారారు

అభివృద్ధి కోసం పార్టీని మారాం అని చెప్పిన బొబ్బిలి పాలకులు ఏం అభివృద్ధి చేశారో  మాకే తెలియదని బొబ్బిలి ప్రజలు అంటున్నారన్నారు. అన్నా..అభివృద్ధి ఆ కుటుంబానికి జరిగింది కానీ మాకు జరగలేదన్నా అని బొబ్బిలి ప్రజలు అంటున్నారన్నారు. అభివృద్ధి జరగడంలేదని,  మంత్రి పదవులు తీసుకుని మాంగనీసు తవ్వకాలు జరుపుతున్నారని దుయ్యబట్టారు.  పాత బొబ్బిలిలో గిరిజనుల సంబంధించిన మిగులు భూములు ఎకరానికి కోటిన్నర విలువచేసే 15 ఎకరాలు గిరిజనుల నుంచి లాక్కుంటురన్నారు.  ఇదే బొబ్బిలిలో వేగవతి, స్వర్ణముఖి చంపావతి, గోస్తనీ, నాగవళి నదులు అక్రమ ఇసుక ఇవాళ ఎక్కడ చూసిన కనిపిస్తోంది. బొబ్బిలిలో అయితే చెరువులు కూడా కబ్జా అవుతున్నాయన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడేవారు ఆలోచించాలి. తోటపల్లి ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో పట్టించుకోలేదని,.చంద్రబాబు వదిలేసిన ప్రాజెక్టును దివంగత నేత వైయస్‌ఆర్‌ పరుగులు పెట్టించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి 90 శాతం పూర్తయిన ప్రాజెక్టును  నాలుగున్న సంవత్సరాల్లో మిగిలిన 10 శాతం కూడా పూర్తిచేయకుండా వదిలేశారన్నారు.  లక్ష 30 వేల ఎకరాలకు  సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు నేడు 80వేల ఎకరాలకు కూడా  నీరు అందించలేని పరిస్థితిలో వుందన్నారు. అదే వైయస్‌ఆర్‌ హయాంలో పెద్దగడ్డ ప్రాజెక్టు పూర్తిచేస్తే ఆ ప్రాజెక్టు ద్వారా పక్కన నుంచి సాలూరు, రామభ్రదపురానికి సాగునీరు అందించవచ్చు. ఎడమకాల్వ తవ్వరా అని ప్రశ్నించారు.  ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. రోచర్లలో 2,400  ఎకరాలకు మెట్టభూములకు సాగునీరు అందించడానికి ఎత్తిపోత్తల పథకానికి ఆ రోజుల్లో వైయస్‌ఆర్‌ ఆమోదం తెలిపారు. దివంగత నేత ఆమోదం చేసి సర్వే చేస్తున్న వైయస్‌ఆర్‌ మన మధ్యనుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టించుకునే నాధుడే లేడన్నారు. .వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టు సామర్థాన్ని 5వేల ఎకరాలకు పెంచుతానని పాలకుడు హామీ ఇచ్చారు..పెంచారా అని అడుగుతున్నాను. ఇదే పాలకుల హయాంలో 2002లో ప్రభుత్వం ఆధీనంలో నిజాం షుగర్స్‌ ఉండేది. నిజాం షుగర్స్‌కు చెందిన లచ్చయ్యపేట ఫ్యాక్టరీని అప్పట్లోనే కేవలం 25 కోట్ల రూపాయాలకు చంద్రబాబు హయాంలో అమ్మేశారన్నారు. ఆ ప్రాజెక్టు ఎన్‌సిఎస్‌ సంస్థ కొనుగోలు చేసింది.  చక్కెర కార్మికులు నా దగ్గరు వచ్చి  రూ.12 కోట్లు బకాయిలు పడిందన్నా ఇప్పటివరుకూ పైసా కూడా ఇవ్వలేదన్నా అని ఆవేదన వ్యక్తం చేశారన్నారు.. రైతులకు బకాయిలు చెల్లించలేదు కాని  ఫ్యాక్టరీలో చక్కెరను ఏమాత్రం సిగ్గులేకుండా అమ్ముకున్నారన్నారు. కార్మికులకు  ఐదునెలలకు ఒక నెల జీతం ఇస్తున్నారన్నారు.  ఒక మంత్రి ఇలాకా లో రైతులు,కార్మికులు పరిస్థితి దారుణంగా ఉందని పట్టించుకునే నా«ధుడే లేడరన్నారు.  బొబ్బిలిలో పారిశుధ్య కార్మికులకు రెండునెలలుగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని  ప్రభుత్వం వారి మీద కనికరం  చూపించడంలేదన్నారు. జ్యూట్‌ మిల్లులో అతిపెద్ద జ్యూట్‌ మిల్లు అయిన శ్రీలక్ష్మి శ్రీనివాస్‌ జ్యూట్‌మిల్లులో .దాదాపు 2,300 మంది పనిచేస్తున్నారని . చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆ మిల్లును మూసివేశారన్నారు. సహకారం రంగంలో ఉన్న ఫ్యాక్టరీలు చంద్రబాబు హయాంలోనే వరుసగా మూతపడతాయన్నారు. ఒక వైపు జూటు మిల్లులు మూతపడుతున్నాయి. కార్మికులకు ఇవ్వవలసిన జీతాలు, గ్రాట్యూటి రూపంలో దాదాపు 15 కోట్ల రూపాయాలు బాకీ పడిందన్నారు.. ఇంత జరుగుతూ ఉంటే మంత్రి అభివృద్ధి జరుగుతుందంటూ  స్వార్థంతో  వైయస్‌ఆర్‌సీపీలో నుంచి టీడీపీకి ఫిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు..వేగవతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ బ్రిడ్జి మీకు కనిపించిందా అని అడిగారు.గతంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన గురించి తెలుసు. ఆయన మోసం చేయడానికి ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారేవాడు. తనకు చావే లేకుండా ఉండాలని ఒక వరం పొందాడు. దేవతలు అయినా సరే, పురుషులయిన సరే ఎవరి చేతుల్లో కూడా చావులేకుండా ఉండాలని వరం పొందాడు. ఆ వరం పొందిన మహిషాసురుడు రెచ్చిపోయాడు. ప్రజలను నానా హింసలకు గురిచేశాడు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు పాలన  మహిషాసురుడు పాలనను తలపిస్తోంది.అధికారం కోసం ఏ గడ్డి అయిన తినే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు.  ఏపార్టీతోనైన పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సిగ్గుపడడన్నారు.  ఏ వ్యవస్థను మేనేజ్‌చేయడానికి మొహమాటపడడన్నారు. ఎన్ని వందల అబద్దాల హమీలైన ఇస్తారని దుయ్యబట్టారు..  దేవుడిచ్చిన శక్తిని దుర్మార్గాలు చేసేందుకు మహిషాసురుడు వాడితే.. మన నారాసురుడు ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజల్ని పీడిస్తూ.. వైయస్‌ఆర్‌సీపీ  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ సంతలో పశువులకు కొనుగోలు చేస్తాడడన్నారు.  మహిషాసురుడు ఎక్కడ కాలు పెట్టిన అక్కడ చీకటి..నారాసురుడు అధికారంలోకి వస్తే కరువు, తుపానులతో రాష్ట్రం అంతలకూతలం మవుతోందన్నారు. మహిషాసురుడు మహిళలు నన్నేమి  చేయలేరని చులకనగా చూసేవాడని,. నారాసురుడు అక్కాచెల్లెమ్మలకు   పొదుపు సంఘాల్లో  14 వందల 206 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఎగొట్టిన ఘనత ఈ నారాసురుడిదన్నారు. మహిళలను కోర్డు మెట్లు ఎక్కిస్తున్న సంఘటనలు ఈ కలియుగంలో నారాసురుడి పాలనలో చూస్తున్నామన్నారు. ప్రతి అక్కాచెల్లెమ్మలకు 10వేలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారని. మళ్లీ అదే పదివేలును అప్పుగా బ్యాంకుల చేత ఇప్పిస్తూ పసుపు–కుంకుమ అని  పేరు పెట్టి బ్యాంకుల చేత ఆ డబ్బును అప్పులుగా ఇప్పించి అప్పులపై వడ్డీలు వసులు చేస్తున్నాడరన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు శాసనసభకు లిఖిత పూర్వకంగా రుణామాఫీ ఎంత జరిగిందని లేఖ సమర్పించారని  దానికి సమాధానంగా రుణామాఫీ జరగలేదని ప్రభుత్వం స్వయంగా లిఖిత రూపంలో ఇచ్చిందని గుర్తుచేశారు. 87వేల612 కోట్లు  ఉన్న వ్యవసాయ రుణాలు  ఈ నాలుగున్న  సంవత్సరాల కాలంలో తడిసిమోపిడై లక్ష 20వేల కోట్లుకు పెరిగిందన్నారు.  రుణమాఫీ దేవుడేరుగు రైతులు అప్పుల్లో కూరుకుపోయారన్నారు.హెరిటేజ్‌ వ్యాపారం చేస్తూ దళారీలకు చంద్రబాబు కెప్టెన్‌గా మారారన్నారు.రైతుల నుంచి తక్కువ రేటుకు పాలను కొని అదే పాలను హెరిటేట్‌ ద్వారా ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారన్నారు.జాబు రావాలంటే బాబు రావాలన్నారు..జాబు రాకపోతే రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, కాని యువతను, నిరుద్యోగులను నిలువునా ముంచారన్నారు.జాబు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారని విమర్శించారు.ఆయుష్‌ పనిచేస్తున్న వారిని తీసేస్తున్నారన్నారు.మున్సిపల్‌ ఉద్యోగులను తొలగిస్తున్నారన్నారు.మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న టీచర్లకు జీతాలు కూడా ఇవ్వడంలేదన్నారు.పద్దతి ప్రకారం ప్రభుత్వ బడులు మూసివేస్తున్నారని,సర్కారీ బడుల్లో నాసిరకం చదువులు చెప్పిస్తున్నారన్నారు. 20వేల టీచర్ల పోస్టులను ఖాళీగా పెట్టారన్నారు.చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో 600 హామీలు ఇచ్చారని ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించారన్నారు.టీడీపీ వెబ్‌సైట్‌లో చూస్తే ఎన్నికల ప్రణాళిక కనిపించదన్నారు.మేనిఫెస్టో చూస్తే ప్రజలు కొడతారని టీడీపీకి భయంపట్టుకుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top