రాజీనామా చేసి ఎదుటివారిని విమర్శించండి

గంట్యాడ:ఎంఎల్‌ఎగా రాజీనామా చేసిన తరువాత ఎదుటవారిని విమర్శించాలని మంగడల వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వర్రి నరిశింహమూర్తి సుజయకృష్ణ రంగారావుకు హితవు పలికారు. కొటారుబిల్లి కూడలిలలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో మినీ మమానాడులో వైయస్‌ఆర్‌సిపి రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణపై అక్కసుతో నోటికి వచ్చినట్లు రాష్ట్రమంత్రి రంగారావు మాట్లాడుతున్నారన్నారు. ఒక సామాజిక వర్గం నాయకుడుగా రాష్ట్రస్థాయిలో బొత్స ఎదుగుదలను చూడలేకపోతున్నారన్నారు. ఎంతో చరిత్రగల బొబ్బిలిరాజుల చరిత్రకు మాయని మచ్చ తెచ్చిన మీరు బొత్సకుటుంబాన్ని విమర్శించడం తగదన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top