నందిమళ్ళలో నేడు షర్మిల సభ

గద్వాల:

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల కాంగ్రెస్, టీడీపీల వైఖరిని తూర్పారబడుతూ చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 43వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం నెట్టెంపాడు నుంచి ఆమె యాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం నందిమళ్ళలో బహిరంగ సభలో మాట్లాడతారు. తొలుత నెట్టెంపాడు రిజర్వాయరును ఆమె సందర్శిస్తారు. వామనపల్లి, నర్సందొడ్డికి చేరిన తర్వాత ఆమె విశ్రాంతి తీసుకుంటారు. జూరాల డ్యామ్ మీదుగా నందిమళ్ళ చేరుకుంటారు. అక్కడ సభలో మాట్లాడిన అనంతరం జాతీయ రహదారి మీదుగా మూలమళ్ళ చేరుకుంటారు. గురువారం శ్రీమతి షర్మిల మొత్తం 17.5 కి.మీ. నడుస్తారు.

Back to Top