నేడు, రేపు వైయస్‌ఆర్‌సిపి వైద్య శిబిరాలు

కడప, 8 సెప్టెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. తద్వారా ప్రజలకు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తేవాలని పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ శని, ఆదివారాల్లో రైల్వేకోడూరు, చక్రాయపేటలో సాహి ఫౌండేషన్ ‌ఫర్ హియరింగ్ ఎయి‌డ్ ఆధ్వర్యంలో చెవి సంబం‌ధ వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. 

ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు శనివారం ఉదయం రైల్వేకోడూరులో ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైయస్ కొండారెడ్డి, పలువురు పార్టీ‌ నేతలు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరాల్లో 15 మంది అపోలో వైద్యులు తమ సేవలు అందిస్తున్నారు. శస్త్ర చికిత్స అవసరం అయినవారిని హైదరాబాదుకు   రిఫ‌ర్ చే‌స్తారు.
Back to Top