తీరుమార‌కుంటే ఊరుకో బోం

కురుపాం: చ‌ంద్ర‌బాబు నిరంకుశ పాల‌న‌లోనే అధికారులు సైతం న‌డ‌వ‌డం దారుణ‌మ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప‌శ్రీ‌వాణి అన్నారు. గిరిజ‌న ఎమ్మెల్యేల ప‌ట్ల చుల‌క‌నగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం ఎంపీపీ అనిమి ఇందిరాకుమారి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మండ‌ల స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో పాల్గొన్నారు. జీవో నంబ‌ర్ 520 ప్ర‌కారం నియోజ‌క‌వ‌ర్గంలోని అభివృధ్ధి కార్య‌క్ర‌మాలు, ప్రారంభోత్స‌వాల‌ను స్థానిక ఎమ్మెల్యేకు తెలియ‌జేయాలని స్ప‌ష్టం చేశారు. కానీ స్థానిక అధికారులు మాత్రం ఇందుకు విరుద్దంగా ఇత‌ర ప్రాంతాల నాయ‌కుల‌ను తీసుకొచ్చి ప్రారంభోత్స‌వాలు చేయ‌డం ప‌ట్ల నిప్పులు చెరిగారు. ఇది మంచి ప‌ద్థతి కాద‌ని అధికారుల‌కు సూచించారు. కేవ‌లం తాను గిరిజ‌న ఎమ్మెల్యే కావ‌డం ద్వారానే అధికారులు ఇలాంటి ధ్వంధ వైఖ‌రిని అవలంబిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా అధికారులు త‌మ త‌ప్పును తెలుసుకొని తీరుమార్చుకోకుంటే ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని చెప్పారు.

Back to Top