ఏ హోదాతో కుటుంబరావు మాట్లాడుతున్నారు..
ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే ఎదురుదాడి...

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత పార్థసారధి

విజయవాడః రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన అంశాలు, నిర్ణయాలపై మంత్రులు బదులు కుటుంబరావు సమాధానం చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత పార్థసారధి ప్రశ్నించారు. ఏ హోదాతో ప్రభుత్వం పరమైన నిర్ణయాలపై కుటుంబరావు ఛాలెంజ్ చేస్తారని,. దీనిపై చంద్రబాబు ఆలోచన ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సిఆర్‌డిఏ విడుదల చేసిన బాండ్లు పదిన్నర శాతం వడ్డీతో దాదాపు 2వేల కోట్లు స్వీకరించి, అప్పులు తీసుకోవడం కూడా గొప్పగా టీడీపీ ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. ఆర్థిక వేత్తలు, రాజకీయ పక్షాలు కూడా దీనిని తప్పబట్టిన విషయాన్ని గుర్తు చేశార. కుటుంబరావుకు దమ్ముంటే పదిన్నర శాతానికి తక్కువ వడ్డీకి తీసుకురండని, నేను రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారని ఈ ఛాలెంజ్‌ను స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ఆర్థిక సంస్థల నుంచి కేవలం 8 శాతం వడ్డీకే రుణాలు తీసుకోండి లేకపోతే కమర్షిల్ బ్యాంకునుంచి 8 శాతం కంటే తక్కువకు అప్పులు ఇప్పిస్తామని చెప్పి జీవో చేసిందో దానిపై సంతకాలు పెట్టిన మంత్రులు, అధికారులపై చర్యలు తీసుకుంటే మి ఛాలెంజ్ స్వీకరిస్తామన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలు ప్రజా ప్రయోజనాలు కోసం కాకుండా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వేధింపులకు గురి చేయడమే పనిగా టీడీపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కుటుంబరావు లాంటి వ్యక్తితో మాట్లాడిస్తున్నరన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ. ఈ వ్యవహారంలో కుట్రకు కుటుంబరావు ఆద్యుడనే అనుమానం కలుగుతోందన్నారు.. నాలుగేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం కనీసం ఒక్క బాధితుడికి కూడా న్యాయం చేయలేదన్నారు. చేతకాని అసమర్థ ప్రభుత్వం తప్పిం చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని, ప్రజలకు సమాధానం చెప్పలేక ఎదురు దాడికి దిగుతున్నారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు.