మాయ మాట‌లు చెప్ప‌డం బాబుకు అల‌వాటు

అనంత‌పురం: ప‌్ర‌జ‌ల‌కు మాయ‌మాట‌లు చెప్ప‌డం.. వారిని బుట్ట‌లో వేసుకోవ‌డం చంద్ర‌బాబుకు అల‌వాటు అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్ట‌ప‌ర్తి స‌మ‌న్వ‌క‌ర్త దుద్ద‌కుంట శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు.  పుట్ట‌ప‌ర్తిలో పార్టీ కార్యాల‌య నిర్మాణానికి శుక్ర‌వారం భూమి చేసిన అనంత‌రం శ్రీ‌ధ‌ర్ రెడ్డి మీడియాతోమాట్లాడారు. చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు 600పైగా వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క‌టి నెర‌వేర్చిన పాపాన పోలేద‌న్నారు.  వర్షాలు లేక ఖరీప్‌లో సాగు చేసిన పంటలు ఎండిపోతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. రైతులకు కనీసం బరోసా ఇచ్చేనాథుడే లేడన్నారు. గత సంవత్సరం వేరుశనగకు రెయిన్‌గన్‌లని హడావిడి చేసిన ప్రభుత్వం ప్రస్తుతం లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా పట్టించకున్నపాపాన పోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక పుట్టపర్తిలో రూ.3 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులు అప్పుడే నాణ్యత లేవని తేల్చి చెప్పినా పట్టించుకోక పోవడంతో 8 నెలలు తిర‌గ‌కుండానే శిథిలావ‌స్థ‌కు చేరుకున్నాయ‌న్నారు.  సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టమని డిమాండు చేశారు. నంద్యాల‌లో అభివృద్ధి చేస్తున్నామంటూ చంద్ర‌బాబు మాట మాట‌లు చెబుతున్నార‌ని,  ఎన్నిక‌లు అవ‌గానే నంద్యాల‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌న్నారు. ఇళ్లు పడగొట్టి ప్రజలను రోడ్ల పాలు చేశారన్నారు. వారి బాబుకు క‌చ్చితంగా త‌గులుతుంద‌ని విమ‌ర్శించారు.  కార్య‌క్ర‌మంలో కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, ఏడీసీసీ డైరెక్టర్‌ ఏవి రమణారెడ్డి, నాయకులు ఇంద్రజిత్‌రెడ్డి, అవుటాల రమణారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, నరసారెడ్డి, గోవర్దన్‌రెడ్డి, బీడుపల్లి శ్రీధర్‌రెడ్డి,లోచర్ల ఈశ్వరరెడ్డి, తలమర్ల సంజీవరెడ్డి, లోచర్ల రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పుట్ట‌ప‌ర్తిలోని సాయి ఆరామం ఎదురుగా...
పుట్టపర్తిలోని సాయి ఆరామం ఎదురుగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కార్యాలయ నిర్మాణ పనులను శుక్రవారం ఉదయం 10 గంటలకు పార్టీ సమన్వయకర్త దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి, భార్య అపర్ణ ప్రారంభించారు. కార్యాలయ నిర్మాణం పూర్తయితే నిత్యం తనతో పాటు సిబ్బంది, నాయకులు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉంటామన్నారు.
Back to Top