మంత్రులు రాజీనామా చేయాల్సిందే..!

పశ్చిమగోదావరిః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజీలో రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న భానుప్రీతి కుటుంబాన్ని రోజా పరామర్శించారు. అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ మంత్రులపై విరుచుకుపడ్డారు.

మంత్రులు పీతల సుజాత, నారాయణ, గంటా శ్రీనివాసరావులు  వెంటనే రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని రోజా వాపోయారు. చంద్రబాబు మంత్రులను బర్తరఫ్ చేయాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి పీతల సుజాత విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ఆదాయం వచ్చే గనులపైనే దృష్టిపెడుతున్నారని విమర్శించారు. భానుప్రీతి మృతిపై అనేక అనుమానాలున్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రోజా ప్రభుత్వాన్ని కోరారు.
Back to Top