మంగళవారం షర్మిల యాత్ర 11.8 కిమీ

తాడేపల్లిగూడెం, 21 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 155వ రోజుకు చేరింది. మంగళవారం 11.8 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల నడుస్తారని  పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని వెల్లమిల్లిలో ప్రారంభమయ్యే పాదయాత్ర రాత్రికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని ముదునూరుపాడు చేరుతుందని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లో ఏర్పాటయ్యే సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు.

తాజా ఫోటోలు

Back to Top