హాయ్‌లాండ్‌ కొట్టేయాలని చూస్తే ఊరుకోం

గుంటూరు: అధికారం కోల్పోతామని గ్రహించిన టీడీపీ నేతలు హాయ్‌లాండ్‌ను కొట్టేయాలని చూస్తున్నారని అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. హాయ్‌లాండ్‌ వ్యవహారంపై త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేల కోట్ల విలువైన హాయ్‌లాండ్‌ను కొట్టేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. రెండు, మూడు రోజుల్లో అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై తాడోపేడో తేల్చుకుంటామన్నారు. సీబీఐతో విచారణ జరిపితే భాగోతం బయటపడుతుందని, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా సీఎం చంద్రబాబు నాయుడు జీఓ జారీ చేశారని మండిపడ్డారు. బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. 

Back to Top