ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న పోలీసులు

వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త సత్యనారాయణపై దాడి అమానుషం
జంగారెడ్డిగూడెం రూరల్‌: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అండతో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి చనమాల శ్రీనివాస్‌ విమర్శించారు. వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త చిన్నబోయిన సత్యనారాయణను ఎమ్మెల్యే పిలుస్తున్నారని చెప్పి తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లుగా పోలీసులు అతనిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యనారాయణపై కానిస్టేబుల్‌ మురళీ దాడి చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. సత్యనారాయణ కాలర్‌ పట్టుకొని ఈడ్చుకెళ్లి దాడి చేయడం ఎంతవరకు సమంసజం అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చింతమనేనికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసులతో ప్రతిపక్షనేతలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సత్యనారాయణకు న్యాయం జరిగేలా పోలీస్‌ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాశం రామకృష్ణ, పార్టీ బీసీ నాయకులు కేమిశెట్టి మల్లిబాబు, పొట్నూరు రమణ, కాగితాల రామారావు, జెవీడీ ప్రసాద్‌లు  ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top