కుమ్మరి కులస్తులకు వైయస్‌ జగన్‌ భరోసాకుమ్మరి చక్రం తిప్పి సందడి చేసిన వైయస్‌ జగన్‌
విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కుమ్మరి కులస్తులను కలిశారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కుమ్మరి చక్రం తిప్పి జననేత సందడి చేశారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. నవరత్నాల పథకాలతో అందరికీ లబ్ధి చేకూరుతుందని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. యలమంచలి నియోజకవర్గంలో కుమ్మరి కులస్తులు కలిశారు. కుల వృత్తులపై ఆధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తమకు ఎలాంటి సాయం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు రావడం లేదని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత మమ్మల్ని ఆదుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ హామీతో ఆ సామాజిక వర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుంటామని పేర్కొన్నారు.
 
Back to Top