హైదరాబాద్, 29 సెప్టెంబర్ 2012: రాష్ట్రంలోని కులాలు, ప్రాంతాల మధ్య తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయడు చిచ్చు రేపుతున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా అన్ని విధాలుగాను పలుకుబడి కోల్పోయి అప్రతిష్ట పాలైన చంద్రబాబు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని, అందుకే ఇలాంగి దుస్తంత్రాలకు పాల్పడుతున్నారని కొరుముట్ల, నల్లా ఆరోపించారు.<br/>తొమ్మిదేళ్ల పాటు మన రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు సర్వనాశనం చేశారని కొరుముట్ల, నల్లా దుయ్యబట్టారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ అని ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. 'వస్తున్నా... మీ కోసం’ అని పేరు పెట్టుకుని అసలు యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియక చంద్రబాబు అయోమయంలో పడ్డారని వారు ఎద్దేవా చేశారు.<br/>తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టించాయని, చివరికి న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబును మాదిగలు ఎంత మాత్రం నమ్మబోరని నల్లా సూర్యప్రకాష్ చెప్పారు. తొమ్మిదేళ్లలో మాదిగలకు ఆయన ఏమి ఒరగబెట్టారో చెప్పాలన్నారు. నమ్మకానికి వైయస్ మారుపేరు అని, నమ్మక ద్రోహానికి చంద్రబాబు పెట్టింది పేరని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.