శ్రీకృష్ణదేవరాయలకు ఘన నివాళి

విశాఖ:  కృష్ణదేవరాయలకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. విజయనగర సామ్రజ్య పాలకుడు, బహుభాషా కోవిదుడు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు గురువారం నగరానికి చెందిన ఘంటసాల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఘనంగా నిర్వహించింది. ఈమేరకు బీచ్‌రోడ్డులో గల శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి  వైయస్‌ఆర్‌సీపీ అధికారప్రతినిధి కొయ్యప్రసాదరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది సాహిత్య రంగానికి కృష్ణదేవరాయలు ఎనలేని సేవలు అందించారన్నారు. తెలుగు, తమిళ,కన్నడ, సంస్క ృకవి పండితులను పోషించిన దానకర్ణుడని సాహిత్య చరిత్రలో ఆణిముత్యాల వంటి ప్రభందక్యూలు వెలుగుచూడడానికి కారకులయ్యారన్నారు.  ఆముక్తమాల్యద పద్యకావ్యాల్ని స్వయంగా తనే రచంచరన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన సువర్ణకారులు ఆయన నోటినుంచి జాలువారినవేనని పేర్కొన్నారు.   

Back to Top