కరవాలంతో షర్మిల!

ఉరవకొండ

5 నవంబర్ 2012 : 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర జరుపుతున్న షర్మిలకు దారిలో వివిధ వర్గాల ప్రజలు ఎదురేగి సాదరంగా స్వాగతం పలుకు తున్నారు. ఉరవకొండ నియోజక వర్గంలో ఆదివారం గొర్రెల కాపరులు కలుసుకుని ఆమెకు ఒక గొర్రెపిల్లను బహూకరించగా సోమవారం లంబాడీలు కలిసి తమ సంప్రదాయ వస్త్రాలను కప్పి సంబరపడ్డారు. షర్మిలను తమతో కాసేపు నృత్యం చేయించారు. అలాగే అభిమానులు కొందరు ఆమెకు కరవాలం, డాలును బహూకరించారు. వారి కోరిక మేరకు ఆ కరవాలాన్నిదూసి షర్మిల వారిని సంతోషపెట్టారు.

Back to Top