తోటపల్లి గూడూరు: థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కాలుష్య ప్రభావిత గ్రామాలను గురువారం సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్థన్‌రెడ్డి సందర్శించనున్నట్లు స్థానిక వైయస్సార్‌సీపీ నాయకులు ఉప్పల శంకరయ్యగౌడ్‌తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ వరకవిపూడి పంచాయితీ అనంతపురం గ్రామంలో ఉన్న సెంబ్‌కార్ఫ్‌గాయత్రి పవర్ ప్రాజెక్ట్ కారణంగా వరకవిపూడి పంచాయతీలోని అనంతపురం, శివరామపురం మండపం పంచాయితీలోని ఇసుకదొరువు, కాటేపల్లి, సీఎస్‌పురం, గొల్లపాళెం గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకొన్నాయన్నారు. స్థానికుల అభ్యర్థనతో ఎమ్మెల్యే కాకాణి వాస్తవ స్థితిగతులను తెలుసుకొనేందుకు కాలుష్యం బారిన పడిన గ్రామాలను సందర్శిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాధితుల బాధలను తెలుసుకొని సమస్య పరిష్కారానికి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడడం జరుగుతుందన్నారు.<br/>